YouTuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య..నేనే చంపానని వైష్ణవి సోదరుడు
YouTuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్తే నడిరోడ్డుపై పొట్టనబెట్టుకున్న ఆ ఉదంతం తాలూకు విషాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.
YouTuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య..నేనే చంపానని వైష్ణవి సోదరుడు
YouTuber Vaishnavi: ఒక ఏడాది క్రితం... సరిగ్గా ఇదే రోజున జరిగిన ఒక దారుణ హత్య నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేసింది. యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్తే నడిరోడ్డుపై పొట్టనబెట్టుకున్న ఆ ఉదంతం తాలూకు విషాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.
సరిగ్గా అదే తేదీకి ఏడాది తిరిగేసరికి... ఇప్పుడు అదే స్థలంలో, అదే పగతో మరో ఘోరం జరిగింది. అప్పట్లో వైష్ణవి ప్రాణాలు తీసిన భర్త హరిబాబు... ఇప్పుడు ఆమె సోదరుడి చేతిలో రక్తపుమడుగులో నేలకొరిగారు. ఈ ఊహించని పరిణామంతో నిజామాబాద్ సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
నిజామాబాద్‌లో కలకలం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. వైష్ణవి భర్త హరిబాబును తానే స్వయంగా హత్య చేసినట్లు ఆమె సోదరుడు సంతోష్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో సంతోష్ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన చెల్లి వైష్ణవిని ఆమె గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నవాడిని తానే అంతం చేసినట్లు బహిరంగంగా ఒప్పుకున్నాడు.
ఏ ఆడబిడ్డకు కూడా తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. చెల్లి మరణానికి ఇలా తాను సొంతంగా న్యాయం చేసుకున్నానని పేర్కొంటూ, ఈ ఘటనకు సంబంధించి నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నట్లు సంతోష్ ఆ వీడియోలో ప్రకటించడం సంచలనంగా మారింది.
యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త హరిబాబు అత్యంత క్రూరంగా హత్య చేశాడు. గర్భవతి అని కూడా చూడకుండా చేసిన ఈ దారుణం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
సరిగ్గా ఏడాది పూర్తియిన అదే రోజున... వైష్ణవి హత్యకు ప్రతీకారంగా ఆమె సోదరుడు సంతోష్ చేతిలో హరిబాబు హతమయ్యాడు. కాలం ఎంత వేగంగా మారినా, పగ మాత్రం కచ్చితంగా రూపం మార్చుకుని తీరుతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది.
ఒకే కుటుంబంలో జరిగిన ఈ వరుస విషాదాలు నిజామాబాద్ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంతోష్ విడుదల చేసిన వీడియో, ఈ ప్రతీకార హత్యకు సంబంధించిన వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.




