Viral News : పుట్టుకతోనే మీసాలు, గడ్డం.. ఈ బేబీ వీడియో నిజమేనా?

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వింత చూస్తామో ఊహించడం కష్టం. తాజాగా ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్న ఓ నవజాత శిశువు వీడియో నెటిజన్లను ముక్కున

G Krishna
Published on: 25 Oct 2026 2:07 PM IST
viral-news
X

viral-news

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వింత చూస్తామో ఊహించడం కష్టం. తాజాగా ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్న ఓ నవజాత శిశువు వీడియో నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. కారణం ఏంటంటే.. పుట్టిన ఆ పసికందుకు పెద్దవాళ్లలాగా దట్టమైన మీసం, గడ్డం కనిపించడమే! ప్రస్తుతం ఈ వీడియో నిజమైనదా లేక క్రియేటివ్ ఎడిటింగ్‌తో రూపొందించిందా అనే దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

సోషల్ మీడియాలో మీమ్‌ల రచ్చ

టిక్‌టాక్‌తో పాటు పలు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో, ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఓ పసికందు కాళ్లు చేతులు ఆడిస్తూ కనిపిస్తాడు. పక్కనే ఉన్న ఓ మహిళ ఆ చిన్నారితో ముచ్చటిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల సరదా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. "పుడుతూనే రిటైర్మెంట్ ఏజ్‌కి వచ్చేసినట్లు ఉన్నాడు", "బాధ్యతలు ఎక్కువై పుట్టగానే మీసాలు వచ్చేశాయేమో" అంటూ ఫన్నీ మీమ్స్‌తో కామెంట్లు పెడుతున్నారు.

ఏఐ ఫిల్టరా? లేక మెడికల్ వండరా?

వైద్య నిపుణుల ప్రకారం.. కొంతమంది నవజాత శిశువుల శరీరంపై 'లానుగో' (Lanugo) అని పిలిచే లేత వెంట్రుకలు ఉండటం సహజమే. కానీ, అవి చాలా పలుచగా, నల్లగా కాకుండా లేత రంగులో ఉంటాయి. వీడియోలో కనిపిస్తున్నంత దట్టమైన మీసాలు ఉండటం అసాధ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు వీడియోను నిశితంగా గమనించిన డిజిటల్ నిపుణులు.. పసికందు ముఖం కదులుతున్నప్పుడు ఆ మీసాల పొజిషన్ మారడం, లైటింగ్ ఆధారంగా పడాల్సిన నీడలు సరిగ్గా లేకపోవడాన్ని పసిగట్టారు. కాబట్టి ఇది సాధారణ వీడియోపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫిల్టర్ లేదా డిజిటల్ ఓవర్‌లే ఉపయోగించి క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ తీశారు? ఆ కుటుంబ సభ్యులు ఎవరు? అనే వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.