Viral Video: ఉద్యోగులకు ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చిన యూఏఈ కంపెనీ.. చివరిలో ఊహించని ట్విస్ట్!
Viral Video: యూఏఈకి చెందిన 'వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్' కంపెనీ తమ ఉద్యోగులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. గిఫ్ట్ బాక్స్‌లలో ఐఫోన్లు ఇస్తూ ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.
Viral Video: ఉద్యోగులకు ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చిన యూఏఈ కంపెనీ.. చివరిలో ఊహించని ట్విస్ట్!
Viral Video: తమ సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను అభినందించేందుకు యూఏఈకి చెందిన ఓ కంపెనీ వినూత్న రీతిలో ముందుకు వచ్చింది. ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ తమ సిబ్బందికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కంపెనీ ఆధ్వర్యంలో ప్యాక్ చేసిన గిఫ్ట్‌లను వరసగా పెట్టి, వాటిలో నచ్చినది ఎంచుకోవాల్సిందిగా ఉద్యోగులకు ఆఫర్ చేశారు. ముందుగా ఓ ఉద్యోగి బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఖరీదైన 'ఐఫోన్' (iPhone) ఉండడంతో ఆశ్చర్యపోయాడు. మరో ఉద్యోగి తాను ఎంచుకున్న బాక్స్‌ను ఓపెన్ చేయగా అందులో కేవలం 'చాక్లెట్' మాత్రమే రావడంతో కొద్దిగా నిరాశ చెందాడు. ఈ విధంగా అదృష్టం బాగున్న కొందరికి ఐఫోన్లు రాగా, మిగిలిన వారికి చాక్లెట్లు వచ్చాయి.
అయితే చాక్లెట్లు పొందిన ఉద్యోగులు నిరాశ చెందకుండా కంపెనీ యాజమాన్యం ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. చాక్లెట్లు వచ్చిన వారందరికీ కూడా చివర్లో ఖరీదైన ఐఫోన్లను బహుమతిగా అందజేసి వారిలో సంతోషం నింపింది.
ఈ మనసును హత్తుకునే అద్భుతమైన వీడియోను కంపెనీ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆయన భార్య హసీనా నిషాద్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “మన ఉద్యోగుల అంకితభావం, సానుకూల స్ఫూర్తి, సామూహిక శ్రమ నుంచే నిజమైన విజయం వస్తుంది. మనల్ని ముందుకు నడిపించడంలో ప్రతి ఒక్కరి సహకారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే వారికి మా తరఫున ఈ చిరుకానుక” అని హసీనా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారుతూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంటోంది.




