Viral: బ్యాంక్ యాప్‌లో బ్యాలెన్స్ చెక్ చేయగా.. ఉన్నది చూసి షాక్.!

Viral: సికార్‌లో మెడికల్ షాప్ ఉద్యోగి ఖాతాలో రూ. 10 వేల కోట్లు కనిపించాయి, సాంకేతిక సమస్యగా తేలింది.

Ravi
By Ravi
Published on: 31 Oct 2026 6:37 PM IST
Viral
X

Viral: బ్యాంక్ యాప్‌లో బ్యాలెన్స్ చెక్ చేయగా.. ఉన్నది చూసి షాక్.! 

Viral: రాజస్థాన్‌లోని సికార్‌లో ఓ వ్యక్తి ఖాతాలో రూ. 10 వేల కోట్లు జమ కావడం కలకలం రేపింది. మెడికల్ షాపులో పని చేసే సమీర్ ఖాన్‌కు నెలకు రూ. 10 వేల జీతం వస్తుంది. ఫోన్ రీఛార్జ్ చేసేందుకు కోటక్ బ్యాంక్ యాప్‌లో బ్యాలెన్స్ చెక్ చేయగా రూ. 10 వేల కోట్లు ఉన్నట్లు చూపడంతో షాకయ్యాడు. కానీ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడంతో తన రూ. 55 వేలనూ వాడుకోలేకపోయాడు.

దీంతో యజమానితో కలిసి సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక బ్యాంకుకు వెళ్లి అసలు విషయం అడగ్గా, సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందని చెప్పారు. అయితే ఆ తర్వాత సమస్యను పరిష్కరించారని, ఖాతాలో ఉన్న రూ. 55 వేలపై హోల్డ్ తొలగించారని సమీర్ తెలిపాడు. అయితే అటు పోలీసులు మాత్రం అంతమొత్తంలో డబ్బు ఏవి ఖాతాలో జమ కాలేదని అంటున్నారు.

ఇక ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి, ప్రతిసారీ బ్యాంకులు చెప్పింది ఒక్కటే, సాంకేతిక సమస్య. 2023 సెప్టెంబర్‌లో చెన్నైలో ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమైనట్లు కనిపించింది. అదే నెలలో తంజావూరులో మరో ఖాతాలో రూ. 750 కోట్లు కనిపించాయి. అక్టోబర్ 7న చెన్నైలో ఫార్మసీ ఉద్యోగి మహ్మద్ ఇద్రీస్ ఖాతాలో రూ. 753 కోట్లు జమైనట్లు మెసేజ్ వచ్చింది. ఈ మూడు ఘటనల్లోనూ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలే ఉన్నాయి. ఎస్‌ఎంఎస్ బగ్ వల్లే ఇలా జరిగిందని బ్యాంక్ అప్పట్లో వివరణ ఇచ్చింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.