Viral: ఇదేందిది.. అక్కడ జనం కంటే సైకిళ్లే ఎక్కువ.! ఆ దేశం ఏంటో తెలుసా.?

Viral: నెదర్లాండ్స్‌లో జనాభా కంటే సైకిళ్ల సంఖ్యే ఎక్కువని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం తెలిపింది, సైక్లింగ్ వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం, ఉద్యోగాలకు కూడా మేలు జరుగుతుందని వెల్లడించింది.

Ravi
By Ravi
Published on: 28 Nov 2026 5:58 PM IST
Viral
X

Viral: ఇదేందిది.. అక్కడ జనం కంటే సైకిళ్లే ఎక్కువ.! ఆ దేశం ఏంటో తెలుసా.? 

Viral: నెదర్లాండ్స్‌లో జనాభా కంటే సైకిళ్ల సంఖ్యే ఎక్కువని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం తెలిపింది. అక్కడ 2.2 కోట్లకు పైగా సైకిళ్లు ఉండగా, ప్రజల సంఖ్య 1.8 కోట్లు మాత్రమే. ఇది పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం, ఉద్యోగాలకు కూడా మేలు చేస్తోందని UNEP పేర్కొంది. ఐరోపాలో వాహనాల పొగ వంటి కారణాలతో పెరుగుతున్న బయటి గాలి కాలుష్యం ఏటా 5 లక్షల అకాల మరణాలకు కారణమవుతోంది. అయితే సైకిళ్లపై ఉన్న ఇష్టం వల్ల డచ్ ప్రజల ఆయుర్దాయం అర్ధ సంవత్సరం పెరుగుతోందని ఓ అధ్యయనం అంచనా వేసింది.

సైక్లింగ్‌ను ప్రోత్సహించే విధానాలు ఆరోగ్యానికే కాదు, ఉద్యోగాల సృష్టికి, గ్రీన్ ఎకానమీకి మారడానికి కూడా తోడ్పడతాయి. ఆమ్‌స్టర్‌డామ్ ఇప్పటికే సైక్లింగ్ ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలను దాదాపు పూర్తిగా వినియోగించుకుంది. ఐరోపాలోని 56 పెద్ద నగరాల ప్రజలు కోపెన్‌హాగెన్ వాసుల స్థాయిలో సైకిళ్లు వాడితే సుమారు 4.35 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని ఐక్యరాజ్యసమితి అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనాన్ని UN ఎన్విరాన్‌మెంట్, UN ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి చేశాయి. బైక్ లేన్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉంటే సైకిళ్ల తయారీ, సర్వీసులతో పాటు పర్యాటక, నిర్మాణ రంగాల్లో కూడా ఉద్యోగాలు వస్తాయని అది గుర్తించింది.

ఇటీవలి లెక్కల ప్రకారం నెదర్లాండ్స్‌లో సైకిళ్ల సంఖ్య మరింత పెరిగింది. 2010లో 2.23 కోట్లుగా ఉన్నవి 2023 నాటికి 2.41 కోట్లకు చేరాయి. 2023లో అమ్ముడైన 8 లక్షలకు పైగా సైకిళ్లలో 56 శాతం ఎలక్ట్రిక్ బైక్‌లే. ఆ దేశంలో రోజువారీ ప్రయాణాల్లో నాలుగో వంతుకు పైగా సైకిళ్లపైనే జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చిన్న దూరాలకు, ముఖ్యంగా నగరాల్లో ప్రజా రవాణాకు, కార్లకు సైకిల్ పూర్తిస్థాయి ప్రత్యామ్నాయంగా మారింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.