Viral: ఏం కర్మరా బాబూ! బీచ్‌లో ప్రపోజ్ చేశాడు.. కట్ చేస్తే.. నిమిషాల్లో డైమండ్ రింగ్ మాయం..
Viral: అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్‌లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన నిమిషాల్లోనే జేస్ హారిక్ 4 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను అలలో పోగొట్టుకున్నాడు, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral: ఏం కర్మరా బాబూ! బీచ్‌లో ప్రపోజ్ చేశాడు.. కట్ చేస్తే.. నిమిషాల్లో డైమండ్ రింగ్ మాయం..
Viral: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ బీచ్ ప్రపోజల్ ఊహించని మలుపు తిరిగింది. జేస్ హారిక్ అనే వ్యక్తి తన ప్రియురాలికి ప్రపోజ్ చేసిన నిమిషాల్లోనే 4 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను అలలో పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 15 ఆదివారం సాయంత్రం శాన్ క్లెమెంటేలోని కలాఫియా స్టేట్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. సూర్యాస్తమయ సమయంలో ప్రపోజ్ చేయాలని హారిక్ ప్లాన్ చేశాడు. ప్రియురాలు జోయి మాటిన్సన్ ఓకే చెప్పిన వెంటనే అలలు ఎగసిపడ్డాయి. ఎల్‌నినో వల్ల అలలు ఉద్ధృతంగా ఉండటంతో ఆమె కొట్టుకుపోతుందేమోనని భయపడి ఆమెను పైకి ఎత్తాడు.
ఆమెను పట్టుకునే హడావుడిలో అతని చేయి రింగ్ బాక్స్‌కు తగిలింది. బాక్స్ జారి సముద్రంలో పడిపోయింది. మోకాలి లోతు నీళ్లలోనే రింగ్ మాయమైంది. తన ఫోన్, పర్సు, తాళాలు జేబులో ఉండటంతో అవి పోకుండా చూసుకున్నానని హారిక్ చెప్పాడు. బీచ్‌లో ఉన్నవారు కూడా రింగ్ కోసం వెతికారు. అక్కడే ఉన్న జెస్సికా లికాన్ కుటుంబం మొదట అందరూ ప్రపోజల్ జరుపుకుంటున్నారని అనుకుంది. తర్వాత రింగ్ పోయిందని తెలిసింది. మెటల్ డిటెక్టర్లతో కొందరు ఇసుకలో వెతికినా ప్రయోజనం లేకపోయింది.
ఈ ఘటన వీడియోను హారిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన జీవితంలో అత్యంత అందమైన, అత్యంత కఠినమైన క్షణం అని రాశాడు. రింగ్ తిరిగి ఇవ్వమని ప్రకృతిని కోరాడు. రింగ్ దొరకకపోతే కొత్తది కొంటానని హారిక్ చెప్పాడు. ప్రియురాలు సురక్షితంగా ఉండటమే ముఖ్యమని అన్నాడు. రింగ్ వెతికేందుకు ఓ డైవర్ ముందుకొచ్చాడు. దొరికినవారికి బహుమతి ఇస్తానని హారిక్ ప్రకటించాడు.




