IQ Test: మీ ఐక్యూ లెవల్స్‌కు అసలైన పరీక్ష.. ఈ పజిల్‌లో దాగున్న '0'ని 5 సెకన్లలో కనిపెట్టగలరా?
IQ Test: పజిల్ ప్రియుల కోసం ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీ ఐక్యూ లెవల్స్‌కు అసలైన పరీక్ష' అంటూ సవాల్ విసిరారు.
IQ Test: మీ ఐక్యూ లెవల్స్‌కు అసలైన పరీక్ష.. ఈ పజిల్‌లో దాగున్న '0'ని 5 సెకన్లలో కనిపెట్టగలరా?
IQ Test: సుడోకు, ఆప్టికల్ ఇల్యూషన్స్, నంబర్ పజిల్స్ వంటి మెదడుకు పని చెప్పే ఆటలు మనలోని పరిశీలనా శక్తి, ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ఇలాంటి పజిల్స్‌ను క్రమం తప్పకుండా ప్రయత్నించడం ద్వారా చిన్న చిన్న తేడాలను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు పజిల్ ప్రియుల కోసం అలాంటి ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీ ఐక్యూ లెవల్స్‌కు అసలైన పరీక్ష' అంటూ సవాల్ విసిరారు.
ఈ పజిల్‌లో మొత్తం 20 అడ్డు వరుసలు, 20 నిలువు వరుసల్లో ఇంగ్లీష్ ‘O’ అక్షరాలు ఉన్నాయి. మొదటిసారి చూస్తే గ్రిడ్ మొత్తం ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ అక్షరాల మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ దాగి ఉంది. అన్ని అక్షరాల మధ్య ఒక చోట ఇంగ్లీష్ అక్షరం ‘O’కి బదులుగా సున్నా ‘0’ను ఉంచారు. మీ ఛాలెంజ్ ఏంటంటే.. కేవలం 5 సెకన్లలో ఆ ‘0’ ఎక్కడ ఉందో గుర్తించాలి. ఒకసారి మొత్తం ఇమేజ్‌ను చూసి దాన్ని కనిపెట్టడం అంత సులభం కాదు. అందుకే ప్రతి వరుసను, ప్రతి కాలమ్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
‘O’, ‘0’ రెండూ దాదాపు ఒకేలా కనిపించడంతో.. ఈ పజిల్ మరింత కష్టంగా మారింది. అయితే వాటి ఆకారంలో స్వల్పమైన తేడా ఉంటుంది. సాధారణ ‘O’ అక్షరాలతో పోలిస్తే.. సున్నా ‘0’ కాస్త సన్నగా కనిపిస్తుంది. ఆ చిన్న తేడాను 5 సెకన్లలో గుర్తించగలిగితే మీ పరిశీలనా శక్తి నిజంగా అదిరిపోయినట్టే. ఒకవేళ నిర్ణీత సమయంలో సమాధానం కనిపెట్టలేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. టైమర్‌ను పక్కన పెట్టి మరోసారి ఇమేజ్‌ను నిశితంగా పరిశీలించండి. అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తే దాగి ఉన్న సున్నాను గుర్తించే అవకాశం ఉంటుంది.
ఇప్పటికీ ‘0’ ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారా?.. అయితే ఇదిగో చిన్న హింట్. ఇమేజ్‌కు కింది భాగంలో ఎడమ వైపు చూడండి. అక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. సరిగ్గా చెప్పాలంటే.. 13వ అడ్డు వరుస, 4వ నిలువు వరుసలో ఇంగ్లీష్ ‘O’ల మధ్య సున్నా ‘0’ ఉంది. సాధారణ ‘O’లతో పోలిస్తే దాని ఆకారంలో ఉన్న స్వల్పమైన తేడాను గమనిస్తే సమాధానం వెంటనే అర్థమవుతుంది. మరి మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను 5 సెకన్లలోనే సాల్వ్ చేశారా? లేదా సమాధానం కోసం మరికొంత సమయం పట్టిందా? ఐ చెక్ చేసుకోండి. దీన్ని మీ స్నేహితులతో షేర్ చేసి.. వారిలో ఎవరు వేగంగా ఈ దాగి ఉన్న ‘0’ను గుర్తిస్తారో కూడా పరీక్షించండి.




