Viral Video: స్వీట్లు కావు ఏకంగా ఐఫోన్ 16లు.. డెస్క్‌లపై ఫోన్లు చూసి ఉద్యోగుల షాక్!

Diwali Gift: దీపావళి సందర్భంగా ఉద్యోగులందరికీ ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చిన దిల్లీ కంపెనీ 'ఫైనాన్సర్ సాబ్'. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో.

Arun Chilukuri
Published on: 4 Nov 2026 12:25 PM IST
Viral Video
X

Viral Video: స్వీట్లు కావు ఏకంగా ఐఫోన్ 16లు.. డెస్క్‌లపై ఫోన్లు చూసి ఉద్యోగుల షాక్!

Diwali Gift: సాధారణంగా దీపావళి పండుగ వచ్చిందంటే చాలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు స్వీట్ బాక్సులు, గిఫ్ట్ హ్యాంపర్లు లేదా నిత్యావసర వస్తువులను బహుమతులుగా ఇవ్వడం చూస్తుంటాం. అయితే వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఢిల్లీకి చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. కంపెనీలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగికి ఏకంగా లగ్జరీ 'ఐఫోన్ 16' స్మార్ట్‌ఫోన్‌ను దీపావళి కానుకగా అందించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న 'ఫైనాన్సర్ సాబ్' అనే సంస్థ ఈ వినూత్న వేడుకకు వేదికైంది. దీపావళి వేడుకల సందర్భంగా ఉద్యోగులు ఆఫీస్‌కు రాకముందే, యాజమాన్యం వారి వర్క్ డెస్క్‌లపై సరికొత్త ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్ బాక్సులను సిద్ధంగా ఉంచింది. ఉదయాన్నే ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులు తమ టేబుళ్లపై ఉన్న ఖరీదైన ఐఫోన్లను చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

తమ కంపెనీ ఇచ్చిన ఈ ఊహించని దీపావళి గిఫ్ట్‌ను చూసి ఆనందంతో ఎగిరి గంతేశారు. ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్ మరియు ఉద్యోగుల ఎమోషనల్ రియాక్షన్స్ వీడియోను సదరు సంస్థ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేస్తూ "మరి మీ కంపెనీలు ఈ దీపావళికి ఏ గిఫ్ట్ ఇచ్చాయి?" అంటూ కంపెనీ సరదా క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

సాధారణ స్వీట్లతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరికీ ఐఫోన్లు ఇచ్చిన యాజమాన్యం ఉదారతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే "మీ కంపెనీలో ఏమైనా ఖాళీలు ఉంటే చెప్పండి, వెంటనే జాయిన్ అవుతాం" అంటూ సరదా కామెంట్లతో కామెంట్ సెక్షన్‌ను హోరెత్తిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.