Viral Video: స్కూటీపై వెళ్తుంటే కుక్కలు తరుముతున్నాయా? అయితే ఈ ట్రిక్ చూడాల్సిందే!
Viral Video: వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి ఓ చైనా వ్యక్తి తన స్కూటీకి వినూత్నంగా కర్రను అమర్చి వాటిని తరిమికొట్టిన వీడియో సోషల్ మీడియాలో..
Viral Video: స్కూటీపై వెళ్తుంటే కుక్కలు తరుముతున్నాయా? అయితే ఈ ట్రిక్ చూడాల్సిందే!
Viral Video: వీధి కుక్కల బెడదతో సతమతమయ్యే వారు ప్రతిచోటా కనిపిస్తుంటారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు కుక్కలు వెంటపడి కరవడానికి రావడం, భయాందోళనకు గురిచేయడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఈ సమస్యకు ఓ చైనా వ్యక్తి కనిపెట్టిన వినూత్న పరిష్కారం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ చైనా వ్యక్తి తన స్కూటీ వెనుక టైరు పైన ఒక చిన్న కర్రను చాలా పద్ధతిగా అమర్చుకున్నాడు. స్కూటీ నడుపుతున్నప్పుడు బటన్ నొక్కితే ఆటోమేటిక్‌గా ఆ కర్ర కదిలి, తనను వెంబడించే కుక్కపై పడేలా ఒక మెకానిజమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
అనుకున్నట్టుగానే వీధిలో తన వెంటపడ్డ కుక్కలపై ఆ కర్రను ప్రయోగించి వాటిని తరిమికొట్టాడు. తన ప్రయోగం విజయవంతమైందంటూ ఆ వ్యక్తి స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వీధి కుక్కల కాటు నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి, రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఇది మంచి ఐడియా అంటూ సరదాగా కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం మూగజీవాల పట్ల ఈ విధంగా హింసాత్మకంగా ప్రవర్తించడం సరికాదని, ఇది జంతు హింస కిందకు వస్తుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు.




