Viral Love Story: ఎలా సెట్ చేశావు తాతా.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి ప్రేమ పెళ్లి!
Viral Love Story: ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యా జిల్లాలో 75 ఏళ్ల రామ్ సుగర్ అనే వృద్ధుడితో 30 ఏళ్ల రాణి రాజ్పుత్ అనే యువతికి నిశ్చితార్థం జరిగింది.
Viral Love Story: ఎలా సెట్ చేశావు తాతా.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి ప్రేమ పెళ్లి!
Weird Age Gap Marriage: ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలామంది అంటుంటారు.. కానీ ఈ విచిత్రమైన ఉదంతం చూశాక నెటిజన్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసిన ఒక షాకింగ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఏకంగా 45 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న ఓ జంట పెళ్లికి సిద్ధపడటంతో నెట్టింట మీమ్స్, కామెంట్లతో రచ్చ రచ్చ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్యా జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్ సుగర్ అనే వృద్ధుడి భార్య ఏడేళ్ల క్రితమే మరణించింది. దాంతో ఆయన ఒంటరితనంతో బాధపడుతున్నారు. అదే సమయంలో, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ యాక్టివ్గా ఉండే 30 ఏళ్ల రాణి రాజ్పుత్ అనే యువతి, రామ్ సుగర్ కూతురితో కలిసి వీడియోలు చేసేందుకు తరచూ వారి ఇంటికి వస్తుండేది.
ఈ క్రమంలోనే రామ్ సుగర్, రాణి రాజ్పుత్ల మధ్య మాటలు కలిసి పరిచయం కాస్తా స్నేహంగా, ఆపై ఊహించని విధంగా ప్రేమగా మారింది. ఒంటరిగా ఉన్న వృద్ధుడికి ఆమె సాన్నిహిత్యం నచ్చడం, ఆయన ఆప్యాయతకు ఆమె ఆకర్షితురాలు కావడంతో ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యంత అట్టహాసంగా వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. రాబోయే నవరాత్రుల పండుగ ముగిసిన వెంటనే వివాహం చేసుకోబోతున్నట్లు ఈ విచిత్ర జంట స్వయంగా ప్రకటించింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి రాగానే కాక పుట్టిస్తున్నాయి.
ఈ వయసు వ్యత్యాసం చూసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ముఖ్యంగా యూత్ రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మేం నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా ఒక అమ్మాయి కూడా పడటం లేదు.. అసలు ఈ ఏజ్ లో ఎలా సెట్ చేశావు తాతా? అంటూ కుర్రాళ్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు మీమ్స్ పేజీలు ఈ జంటపై విపరీతంగా ట్రోల్స్ చేస్తూ, రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనా, 75 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువతితో పెళ్లికి సిద్ధపడిన ఈ తాతా-బ్యూటీల లవ్ స్టోరీ మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.




