Dubbaka: ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి.. మహిళా సంఘాల ఆరోపణలు!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో పారదర్శకత లోపించిందని, ఐకేపీ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని మహిళా సంఘాలు ఆరోపించాయి.
Dubbaka: ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి.. మహిళా సంఘాల ఆరోపణలు!
Dubbaka: ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో పారదర్శకత లోపించిందని, ఐకేపీ క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఆరోపించారు. గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో అవినీతి జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా వచ్చే కమిషన్కు ఒక పంటకు సుమారు రూ.1.50 లక్షల వరకు కాజిస్తున్నారని మహిళలు ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాలను వెల్లడించాలని గత నెల రోజులుగా వివోఏలను కోరుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో రెండు వీవో ల పరిధిలో ఇద్దరు వివోఏలు పనిచేస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. మహిళా సంఘాల గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యే సమయంలో ఒక్కో గ్రూపు నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే రుణాలు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.




