Siddipet: వైద్యుడు లేని రేబర్తి పల్లె దవాఖాన.. ఇబ్బందులు పడుతున్న రోగులు!

Siddipet: సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేబర్తి పల్లె దవాఖానలో ఏడాదిగా వైద్యుడు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 29 Nov 2026 10:00 AM IST
Siddipet
X

Siddipet: వైద్యుడు లేని రేబర్తి పల్లె దవాఖాన.. ఇబ్బందులు పడుతున్న రోగులు!

Siddipet: మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలోని పల్లె దవాఖాన వైద్యులు లేక వెలవెలబోతోంది. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పల్లె దవాఖానలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఏడాది క్రితం బదిలీపై వెళ్లినప్పటికీ, ఇప్పటివరకు వారి స్థానంలో మరొక వైద్యుడిని నియమించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలే రోగులకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పల్లె దవాఖానలోనే వైద్యులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి రేబర్తి పల్లె దవాఖానకు వెంటనే వైద్యుడిని నియమించి, గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL