Siddipet: మద్దూరులో అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం!

Siddipet: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో అకాల వర్షంతో తడిసిన ధాన్యం. ఆందోళనలో రైతులు, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 1 Nov 2026 8:51 AM IST
Siddipet
X

Siddipet: మద్దూరులో అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం!

Siddipet: మద్దూరు మండలంలో నర్సాయ పల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, అకాల వర్షం రూపంలో మరో సమస్య ఎదురుకావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని పరిశీలించి, తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL