Siddipet: కొమురవెల్లి స్వామివారి ధర్మదర్శనానికి పడుతున్న రెండు గంటల సమయం!

Siddipet: ఆదివారం సెలవు దినం కావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 29 Nov 2026 2:01 PM IST
Siddipet
X

Siddipet: కొమురవెల్లి స్వామివారి ధర్మదర్శనానికి పడుతున్న రెండు గంటల సమయం!

Siddipet: సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొమురవెల్లికి చేరుకున్నారు.

భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుండటంతో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL