Siddipet: సిద్దిపేటలో టీఎన్‌జీఓస్ జిల్లా కార్యవర్గ సమావేశం!

Siddipet: సిద్దిపేట జిల్లా టీఎన్‌జీఓస్ (TNGOs) యూనియన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం, దసరా అలైబలై కార్యక్రమం జరిగింది.

RAJU, SIDDIPET
Published on: 29 Oct 2026 12:34 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో టీఎన్‌జీఓస్ జిల్లా కార్యవర్గ సమావేశం!

Siddipet: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం మరియు దసరా సందర్భంగా అలైబలై కార్యక్రమం జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ గారి అధ్యక్షతన పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నందు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రం రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాబోయే దీపావళికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అహర్నిశలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని అన్ని రంగాల్లో అత్యున్నతంగా ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టంగా ఉండాలని కృషి చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లి, ఆ పథకాలను ప్రజలకు అందే విధంగా ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అవార్డులలో సిద్దిపేట జిల్లాకు ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయని, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలలో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఉద్యోగస్తులు అన్ని జిల్లాలకు ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని, ఇదే క్రమంలో ఇంకా కృషి చేసి జిల్లాను భారతదేశంలోని మొదటి జిల్లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉద్యోగులపైనే ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం-ఉద్యోగుల సంబంధం తల్లి-కొడుకుల సంబంధంలా ఉండాలని, ప్రభుత్వం ప్రేమతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు ఉద్యోగులు పర్యావరణం పట్ల పచ్చదనం పట్ల ప్రజలకు అవగాహన కూడా కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే కేవలం జీవితానికి పనిచేసే వారు కాదు పర్యావరణ పట్ల ప్రేమ కూడా ఉండాలని ప్లాస్టిక్ లో పూర్తి నిషేధించాలని ఉద్యోగస్తులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరడం జరిగింది.

రాబోయే రోజుల్లో ఉద్యోగులందరూ కూడా ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎలినినో ప్రభావం ఉందని ఈ ప్రభావం తెలంగాణలో తీవ్రంగా ఉందని ఉద్యోగులందరూ కూడా ఆరోగ్యంతో పాటు ఆర్థిక క్రమశిక్షణతో మెలగాలని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం రెండు డిఏలు ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి ఉద్యోగుల సమస్యలపై శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారికి ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా సమస్యలు చాలా ఉన్నాయని ఆ సమస్యల పట్ల కూడా ఎప్పుడు రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.

ఇట్టి జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET