Thoguta: చిన్న ముత్యంపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చిన్న ముత్యంపేటలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం; 70 మందికి పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ.

Chindam Karunakar, Dubbak
Published on: 22 Nov 2026 10:13 PM IST
Thoguta
X

Thoguta: చిన్న ముత్యంపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చిన్న ముత్యంపేట గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో సుమారు 70 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

వివిధ వైద్య విభాగాలకు సంబంధించి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని, స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించడం జరిగింది. సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ అరవింద్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత మూడు సంవత్సరాల నుండి వరుసగా ముత్యంపేటలో వైద్య శిబిరాలు నిర్వహించి , ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

సమరస్తా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ శిబిరాన్ని సందర్శించి, గ్రామస్తులతోముచ్చటించారు.కార్యక్రమంలో సమరస్తా వేదిక జిల్లా ఉపాధ్యక్షులు విజయభాస్కర్ , జిల్లా కన్వీనర్ మాలే రమేష్ సంచార జాతుల సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు కాలియా యాదగిరి, చిన్న అంబయ్య గోపాల్ గోపాల్ చంద్రయ్య సంతోష్ పలువురు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak