Cheryal: చేర్యాలలో దొంగల హల్‌చల్.. ఇంట్లో తాళాలు పగులగొట్టి చోరీ!
Cheryal: చేర్యాల పట్టణ కేంద్రంలో దొంగలు హల్‌చల్ చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో తాళాలు పగులగొట్టి రూ. 50 వేల నగదు, విలువైన వస్తువులను అపహరించారు.
Cheryal: చేర్యాలలో దొంగల హల్‌చల్.. ఇంట్లో తాళాలు పగులగొట్టి చోరీ!
Cheryal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న కోనేటి రాములు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని పని నిమిత్తం వేరే పట్టణానికి వెళ్లారు.
ఇది గమనించిన దుండగులు రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి డోర్ వేసి ఉన్న తాళన్ని పగుల గొట్టి 50 వేలు నగదు విలువైన వస్తువులను అపహరించినట్లు సమాచారం.
పట్టణ నడిబొడ్డునే చోరీ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుకున్న చేర్యాల సీఐ రమేష్ నాయక్ యస్ఐ అపూర్వ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు
ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
చోరీకి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




