Siddipet: సిద్దిపేటలో హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శరత్ పర్యటన

Siddipet: సిద్దిపేటలో హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శరత్ పర్యటించి జువెనైల్ జస్టిస్ బోర్డు, కోర్టులో మెడికల్ డిస్పెన్సరీని ప్రారంభించి న్యాయ సమీక్ష నిర్వహించారు.

RAJU, SIDDIPET
Published on: 31 Oct 2026 7:01 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శరత్ పర్యటన

సిద్దిపేట జిల్లా: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కే. శరత్ శనివారం జిల్లాలో పర్యటించి జిల్లా కేంద్రంలోనీ సంతోషిమాత ఆలయం దగ్గరలో జువెనైల్ జస్టిస్ బోర్డును ప్రారంభించారు. జిల్లా కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బంది మరియు కోర్టుపనుల మీద వచ్చే ప్రజల సౌకర్యార్థం మెడికల్ డిస్పెన్సరీని ప్రారంభించి వసతులను పరిశీలించారు. అనంతరం కోర్టు భవనంలోని మూడో ఫ్లోర్ లో గల కాన్ఫరెన్స్ హాల్లో జ్యుడీషియల్ అధికారులతో జ్యుడీషియరీ రివ్యూ లో పాల్గొన్నారు.

హైకోర్టు జడ్జి జస్టిస్ కె శరత్ కు జిల్లా జడ్జి జి. సుదర్శన్, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ లు పూల బోకే అందించి స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు జడ్జి జయప్రసాద్, జిల్లా న్యాయ సేవాసాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, అదన్నపు డిసిపి కుషాల్కర్, బార్ అసోసియేషన్ సభ్యులు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, న్యాయశాఖ, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET