Siddipet: మైనారిటీల గ్రేవ్ యార్డ్, ఈద్గా భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి!
Siddipet: సిద్దిపేట గాడిచర్లపల్లిలో మైనారిటీల గ్రేవ్ యార్డ్, ఈద్గా కోసం కేటాయించిన 4 ఎకరాల భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని తంజీమ్ మసాజిద్ కమిటీ వినతిపత్రం ఇచ్చింది.
Siddipet: మైనారిటీల గ్రేవ్ యార్డ్, ఈద్గా భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి!
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లా మైనారిటీలకు సంబంధించిన గ్రేవ్ యార్డ్ (కబరస్తాన్) మరియు ఈద్గా భూమి సమస్యపై ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీఓ మరియు అర్బన్ ఎమ్మార్వో గార్లకు నివేదిక అందజేయడం జరిగింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారి ద్వారా 29-09-2023 తేదీన సిద్దిపేట అర్బన్ మండలం గాడిచర్లపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 244లో ప్రొసీడింగ్ నంబర్ E1/3450/2023 ద్వారా మైనారిటీలకు 4 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సదరు భూమికి హద్దులు ఏర్పాటు చేసి మైనారిటీలకు అప్పగించకపోవడంపై సిద్దిపేట మైనారిటీ తంజీమ్ మసాజిద్ కమిటీ, (Old 414/2010 & New 284/2023)మత పెద్దలు మరియు బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనారిటీలకు సంబంధించిన కబరస్తాన్ మరియు ఈద్గా అవసరాల కోసం కేటాయించిన భూమికి వెంటనే హద్దులు ఏర్పాటు చేసి, అధికారికంగా మైనారిటీలకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. మైనారిటీల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తంజీమ్ మసాజిద్ కమిటీ అక్బర్, నవాబ్, పాషా, జుబేర్, రియాజ్, ఉబైద్, సిద్దిపేట నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు లయీక్, సిద్దిపేట నియోజకవర్గ యువజన అధ్యక్షులు అజీజ్, తదితరులు పాల్గొన్నారు.




