Siddipet: పొట్లపల్లిలో ఘనంగా 'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమం..పాల్గొన్న సర్పంచ్!
Siddipet: సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు. పాల్గొన్న సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్, అధికారులు.
Siddipet: పొట్లపల్లిలో ఘనంగా 'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమం..పాల్గొన్న సర్పంచ్!
Siddipet: సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి దేవస్థానం బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన గడ్డిని సిబ్బంది తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ రాచపల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు కొంకటి సదానందం, పంచాయతీ కార్యదర్శి చక్కా వెంకటేశ్వరరావుతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.




