Dubbaka: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!
Dubbaka: సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్‌లో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Dubbaka: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!
Dubbaka: బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నర్సింలు పిలుపునిచ్చారు.నవంబర్ 27ను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ గ్రామంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని, వారి ఆశయాలకు అడ్డంకిగా మారుతాయని పేర్కొన్నారు. బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి 2026 సెప్టెంబర్ 4న తీసుకున్న తీర్మానం మేరకు ప్రతి సంవత్సరం నవంబర్ 27ను బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించిందని, ఈ ఏడాది తొలిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని ప్రోత్సహించినా, నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.




