Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 14వ వార్డులో వీధి కుక్కల స్వైరవిహారం!
Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో వీధి కుక్కల స్వైరవిహారంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 14వ వార్డులో వీధి కుక్కల స్వైరవిహారం!
గజ్వేల్: ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న శునకాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకలు సాగించే వృద్ధులకు కుక్కల దాడి ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు ఏ కుక్క దాడి చేస్తుందోనన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి సైతం జంకుతున్నామని చెబుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, స్థానిక కౌన్సిలర్ తక్షణమే స్పందించాలని వార్డువాసులు కోరుతున్నారు. ప్రత్యేక చర్యలు చేపట్టి వీధి కుక్కల బెడదను నియంత్రించాలని, ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




