Siddipet: సిద్దిపేటలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!

Siddipet: సిద్దిపేట అర్బన్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. టీటీసీ భవన్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసిన తహశీల్దార్ హరి కిరణ్ కుమార్, ఎంఈఓ రాజ ప్రభాకర్ రెడ్డి.

RAJU, SIDDIPET
Published on: 21 Sept 2026 10:41 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!

సిద్దిపేట: సిద్దిపేటలోని TTC భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ ఏ. రాజ ప్రభాకర్ రెడ్డి, ఎంఈఓ, సిద్దిపేట అర్బన్ వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ హరి కిరణ్ కుమార్, తహసీల్దార్, సిద్దిపేట అర్బన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, ప్రశంసాపత్రాలు మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సభాధ్యక్షులు శ్రీ ఏ. రాజ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు నిరంతరం నూతన బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు విలువలను పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET