Siddipet: శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తా: అత్తు ఇమామ్!

Siddipet: శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తా: సిద్ధిపేట టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్. 8, 9, 10 వార్డుల్లో గణపతి దర్శనం, 400 మందికి అన్నదానం నిర్వహణ.

RAJU, SIDDIPET
Published on: 23 Sept 2026 5:31 PM IST
Siddipet
X

Siddipet: శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తా: అత్తు ఇమామ్!

సిద్దిపేట: నా శ్వాస ఉన్నన్ని రోజులు క్యాం మతం అని చూడకుండా ప్రజలకు సేవ చేస్తా అని ,సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో నిన్న రాత్రి పట్టణంలో 8.9.10 వార్డులలో గణపతులను సందర్శించి మండపాల నిర్వాహకులు, యువత, భక్తులతో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.

పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారి ఆధ్వర్యంలో 400 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ కులం మతాలకు ప్రతీకగా సిద్ధిపేట విరాజిల్లుతుంది

అని వినాయక చవితి ఉత్సవాలు భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయి అని అన్నారు. గణేష్ మండపాలు కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యత సోదరభావం పెంపొందించే వేదికలుగా నిలువాలి అని అన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా యువత చూపుతున్న ఉత్సాహం అభినందనీయం అని అయితే ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో అందరి సహకారంతో నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

మండపాల వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా తాగునీరు విద్యుత్ పారిశుధ్యం భద్రత వంటి అంశాలపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అని వీలైనంత వరకు పర్యావరణహిత పద్ధతుల్లో ఉత్సవాలను నిర్వహించాలి అని అన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలి అని అన్నారు.

వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి అని ప్రతి కుటుంబంలో ఆనందంగా ఉండాలి అని అన్నారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులు యువకులను భక్తులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు గయాజుద్దీన్ విజయ్ డానియల్ నజ్జు సతీష్ కుమార్ సాయిల్ రవి తేజ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET