Siddipet: చందాపూర్‌లో సీసీ కెమెరాలు ప్రారంభించిన అధికారులు, నేతలు!
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి, ఎస్ఐ నవీన్ ప్రారంభించారు.
Siddipet: చందాపూర్‌లో సీసీ కెమెరాలు ప్రారంభించిన అధికారులు, నేతలు!
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో గ్రామ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిఐ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి, ఎస్ఐ నవీన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో ప్రజలు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి సామూహిక కార్యక్రమాల్లో గ్రామస్తులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందా లావణ్య స్వామి, ఉప సర్పంచ్ ఆత్మకూరు శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగారి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.




