Toguta: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట జెడ్పీహెచ్ఎస్‌లో బాల్యవివాహాల నిర్మూలనపై సమావేశం, ర్యాలీ; ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్న కోఆర్డినేటర్ గణేష్.

Chindam Karunakar, Dubbak
Published on: 25 Nov 2026 5:06 PM IST
Toguta
X

Toguta: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సమావేశం, ర్యాలీ నవంబర్ 27 అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెంకటరావుపేటలో ASRITHA – JRC ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సమావేశం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ASRITHA కోఆర్డినేటర్ గణేష్ మాట్లాడుతూ, బాల్యవివాహాలు బాలల భవిష్యత్తును, విద్యను, ఆరోగ్యాన్ని, హక్కులను ప్రభావితం చేస్తాయని తెలిపారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండకముందు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని వివరించారు.

ప్రతి బాలిక ఉన్నత విద్యను అభ్యసించి, తన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. బాల్యవివాహాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులతో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించి, గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak