Siddipet: సిద్దిపేట ప్రజావాణిలో 199 అర్జీలు.. త్వరగా పరిష్కరించాలి

Siddipet: సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ప్రజావాణి ద్వారా 199 అర్జీలు స్వీకరించిన డీఆర్వో నాగరాజమ్మ; అర్జీదారులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశం.

RAJU, SIDDIPET
Published on: 23 Nov 2026 11:12 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట ప్రజావాణిలో 199 అర్జీలు.. త్వరగా పరిష్కరించాలి

సిద్దిపేట: సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రజావాణిలో అర్జిలు మొత్తం 199 వచ్చాయనీ, అర్జిదారులకు న్యాయం చేసి తిరిగి అర్జి పెట్టుకోకుండా పని చెయ్యాలని అధికారులను ఆదేశించారు.ఇట్టి కార్యక్రమంలో ఎస్డిసిలు సుదర్శన్, విజయలక్ష్మి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET