Thoguta: దేవుడి దీపంతో ఘోర అగ్నిప్రమాదం.. సిద్ధపేటలో మూడు ఇళ్లు దగ్ధం

Thoguta: సిద్ధపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో దేవుడి దీపంతో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం. మూడు ఇళ్లు దగ్ధం, రూ.2.50 లక్షల ఆస్తి నష్టం.

Chindam Karunakar, Dubbak
Published on: 10 Nov 2026 6:50 PM IST
Thoguta
X

Thoguta: దేవుడి దీపంతో ఘోర అగ్నిప్రమాదం.. సిద్ధపేటలో మూడు ఇళ్లు దగ్ధం

తోగుట: ఇంట్లో దెవుడి వద్ద దీపం పెట్టి ఇంట్లో వారు బయటకు వెళ్ళడంతో దీపంతో ప్రమాదవశాత్తు ఒక ఇళ్లు మంటలతో దగ్దం అయి ఆ ఇళ్లుతో పాటు పక్కన ఉన్న రెండు ఇండ్లు దద్దమైన సంఘటన సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన చిక్కుడు నర్సింలు, చిక్కుడు రాజవ్వ ఇంటిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మూడు ఇండ్లు దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.అగ్ని ప్రమాదాన్ని స్థానికులు,స్థానిక పోలీసుల సహాయంతో ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఇంట్లో టీవీ, కూలర్, వంట సామాను, ఫ్రిడ్జ్, బట్టలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు.ఇరు కుటుంబాల కు దాదాపుగా రెండు లక్షల 50వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదానికి రెండు ఇల్లు దగ్ధమవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak