Kukunoorpally: కుకునూరుపల్లి మండలం లకుడారంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌!

Kukunoorpally: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారంలో ఏసీపీ నర్సింలు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

Osman Pathan, GAJEWL
Published on: 25 Nov 2026 8:43 PM IST
Kukunoorpally
X

Kukunoorpally: కుకునూరుపల్లి మండలం లకుడారంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌!

కుకునూరుపల్లి: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ శ్రీనివాస్‌, రూరల్‌ సీఐ రవిరాజా, కుకునూరుపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

అక్రమ, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL