Siddipet: సిద్దిపేట కమిషనరేట్‌లో రిపోర్ట్ చేసిన ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు!
Siddipet: 46 వారాల జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ఎదుట కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
Siddipet: సిద్దిపేట కమిషనరేట్‌లో రిపోర్ట్ చేసిన ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు!
సిద్దిపేట: నలబై ఆరు వారాల జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా, సోమవారం ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు జి. సుమ,ఎ .భరత్ రెడ్డి,MD. ముషరఫ్ లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రొబేషనరీ డీఎస్పీలతో సమావేశమై, జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీస్ స్టేషన్ల పనితీరు మరియు క్షేత్రస్థాయి శిక్షణలో నేర్చుకోవాల్సిన కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నిజాయితీ మరియు అంకితభావంతో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సీపీ గారు వారికి సూచించారు.




