Siddipet: పదేళ్ల బీజేపీ వైఫల్యాలు చెప్పడానికి వస్తున్నారా?
Siddipet: ఈ నెల 25న సిద్దిపేటలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన, బీజేపీ ర్యాలీపై మండిపడ్డ మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం; కేంద్ర వైఫల్యాలపై నిలదీత.
Siddipet: పదేళ్ల బీజేపీ వైఫల్యాలు చెప్పడానికి వస్తున్నారా?
సిద్దిపేట: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్ల ఫైఫల్యాలు చెప్పడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డ ఈ నెల 25 సిద్దిపేట కు వస్తున్నార అని సిద్దిపేట మాజీ AMC, చైర్మన్ పాల సాయిరాం ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మాజీ మార్కెట్ చైర్మన్ సారయ్య, మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్, సంతోష్ రెడ్డి లతో కలసి విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు.
రూ 150 లక్షల కోట్లు అప్పులు అయ్యాయిని అన్నారు. అసలు తెలంగాణ కు ఎన్ని నిధులు కేటాయించారచెప్పాలన్నారూ. ప్రతి సంవత్సరం యువతకు 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన విషయాన్ని తెలపడానికి వస్తున్నారని ప్రశ్నించారు, భారతదేశంలో యువకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా అని వాటికి జవాబు చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల జలవంతములను దోచుకుంటున్న ఆంధ్రబాబులకు మొదటి ఇవ్వడానికి వస్తున్నారని అడిగారు.
10 గంటల పరిపాలన తర్వాత కూడా రూపాయిల పడిపోయిందని సామాన్యులకు అందనంత ఎత్తులో పెరిగిపోయాయని మండిపడ్డారు. భారత దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక భారతదేశంలో ద్రవ్యల్బణం ఎంత ఉందో చెప్పడానికి వస్తున్నార అన్నారు. భారత దేశంలో ఇప్పటివరకు మీరు రిజర్వాయర్లు నిర్మించారు తెలంగాణలో కనీసం నిధులైన మంజూరు చేశార ప్రశ్నించారు. నార్త్ లో ఉన్న బుల్డోజర్ సంస్కృతిని తెలంగాణకు పరిచయం చేద్దామని వస్తున్నార అని ప్రశ్నించారు.
కూలిన బ్రిడ్జి ల గురించి చెప్పాడానికి వస్తారా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం అరాచకాన్ని అంతం చేద్దామని నినాదంతో రాలి తీస్తున్నారని కానీ భారతదేశంలో అరాచకం చేస్తున్నది మీరే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేస్తూ వ్యవస్థలను భ్రష్టు పట్టించింది మీరు కాద అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో ప్రజల మధ్య ఉద్దేశం తీసుకొచ్చి నింపింది మీరు కాదా అన్నారు. పాకిస్తాన్ చైనా ను బూచిలుగా చూపుతూ కుర్చీలు కాపాడుకుంటున్నది మీరు కాదన్నారు.
ఎస్ఐ ఆర్ చేపడుతున్నది ఎన్నికల కమిషన్ తప్పు చేస్తే దానిపై చర్యలు తీసుకోవాలి కానీ ఆ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం బ్రష్టు పట్టించిందన్నారు. ఒక జేబులో సిబిఐ ఒక జేబులో వేసుకొని తిరుగుతున్నది ఎవరని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తమ జేబు కమిషనర్ అని బ్రాండింగ్ చేయడానికి మీరు ర్యాలీ నిర్వహిస్తున్నారని విమర్శించారు. గత మూడుసార్లు గెలిచిన మీరు ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచారా లేక ఎన్నికల కమిషన్ నియంత్రించి గెలిచారు అన్న విషయాన్ని అన్నారు.
రెండు జాతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ బిజెపిలో తెలంగాణను భారతదేశంలో అంతర్భాగమని గుర్తిస్తున్నారో లేదో అన్న ప్రశ్న తలెత్తుతుందన్నారు. తెలంగాణలో బడ్జెట్‌కు అసలు ప్రయారిటీ లేకుండా పోయిందన్నారు మరి ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నారు.
బిజెపి నాయకులు తెలపాలన్నారు నిరుద్యోగ రేటు పెరిగిన దాన్ని కార్పొరేట్‌కు వత్తాసు పలకడానికి వస్తున్నారా అని ప్రశ్నించారు. ఎది ఏమైనా అసలు సిద్దిపేట కు ఈ మధ్య టూరిస్ట్ లు ఎక్కువయ్యారని అన్నారు. సమావేశం లో పార్టీ నాయకులు లక్ష్మా రెడ్డి, బెదురు తిరుపతి, నరేందర్, రెడ్డి యాదగిరి, లాయిక్, అజిజ్, నరేష్, పర్శరాములు, సాయి తదితరులు పాల్గొన్నారు.




