Siddipet: 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందిరమ్మ లబ్ధిదారులతో పండుగ సంబరాలు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 7 Nov 2026 4:09 PM IST
Siddipet
X

Siddipet: 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం

సిద్దిపేట: హుస్నాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి”* కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు స్వంత ఇంటి కలను నిజం చేయడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొప్ప పథకం ఇందిరమ్మ ఇళ్లు అని జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ముందువరుసలో ఉందని తెలిపారు.

నిర్మాణం పూర్తిన ఇందిరమ్మ గృహ లబ్ధిదారులతో దీపావళి పండుగ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ఈ మహోన్నత కార్యక్రమం"మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టే చర్యలు, లబ్ధిదారులకు అందించనున్న సదుపాయాలు తదితర అంశాలను అధికారులకు దిశ నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి భగవంత్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD