Siddipet: మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి మండల సభ బహిష్కరణ

Siddipet: మద్దూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సర్పంచులు మండల సభను బహిష్కరించారు. రైతులకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 30 Oct 2026 8:50 PM IST
Siddipet
X

Siddipet: మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి మండల సభ బహిష్కరణ

సిద్దిపేట జిల్లా: మద్దూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని సర్పంచులు మండల సభను బహిష్కరించారు. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులు, వర్షాభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు.

రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం కరువు పరిస్థితులపై సరైన నిర్ణయం తీసుకోవడం లేదని సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మద్దూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు దామెర మల్లేశం శనిగరం సత్యనారాయణ నీరటి శ్రీనివాస్ కనకరాజు గడిపే మౌనిక జక్కుల లింగమ్మ కర్నె సునీత బీజేపీ మండల అధ్యక్షులు మోకు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL