Siddipet: నాలుగు సంవత్సరాలు గడిచిన మల్లన్న గుట్ట పై పూర్తి గాని డమరుకం పనులు!
Siddipet: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి విజయాచాల గుట్టపై నిలిచిపోయిన డమరుకం, త్రిశూలం నిర్మాణం పనులు. బ్రహ్మోత్సవాలలోపు పనులు పూర్తి చేయాలని భక్తుల డిమాండ్.
Siddipet: నాలుగు సంవత్సరాలు గడిచిన మల్లన్న గుట్ట పై పూర్తి గాని డమరుకం పనులు!
Siddipet: సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.. గత నాలుగు సంవత్సరాలుగా స్వామివారి విజయాచాల గుట్టపై సుమారు 68 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన డమరుకం, త్రిశూలం నిర్మాణం పనులు అర్థరంగా నిలిచిపోయాయి.
గత బిఆర్ఎస్ హయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయాచాల గుట్టపై డమరుకం త్రిశూలం నిర్మించాలని ఆదేశాలు జారీచేశారు.. కానీ ప్రభుత్వాలు మారిన ఆలయ అధికారులు మారిన పనులు మాత్రం పూర్తి కాలేదు.
కాంట్రాక్టరర్ నిర్లక్ష్యమా? లేక అధికారుల పట్టింపు లేనితనమా నిర్మాణ వ్యయంలో నిధులు సరిపోక డమరుకం,త్రిశూలం పనులు నిలిచిపోయాయి.. మరో రెండు నెలల్లో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పటికైనా స్వామివారి బ్రహ్మోత్సవాల లోపు విజయాచాల గుట్టపై డమరుకం, త్రిశూలం పనులు పూర్తి చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.




