Komuravelli: కొమురవెల్లి మల్లన్న భక్తులకు 50 గదుల వసతి, క్యూ కాంప్లెక్స్!
Komuravelli: కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 50 గదుల వసతి గృహాలు, క్యూ కాంప్లెక్స్ భవనాలను సిద్దిపేట సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు.
Komuravelli: కొమురవెల్లి మల్లన్న భక్తులకు 50 గదుల వసతి, క్యూ కాంప్లెక్స్!
కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా నిర్మించిన 50 గదుల వసతి గృహాలు, క్యూ కాంప్లెక్స్ భవనాలను సిద్దిపేటలో నిర్వహించిన సభ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొమురవెల్లి దేవస్థానం వద్ద నూతనంగా ప్రారంభించిన భవనాల వద్ద ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలతో భవనాలను ప్రారంభించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ వసతి గృహాలు, క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి రావడంతో కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.




