Siddipet: 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పింఛన్ ఇవ్వాలి
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుటలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం; 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు పింఛన్, ముదిరాజులను BC-Aలోకి మార్చాలని డిమాండ్.
Siddipet: 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పింఛన్ ఇవ్వాలి
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తోగుట, ప్రపంచ మత్సకారుల దినోత్సవ సందర్భంగా మండల కేంద్రమైన తోగుట లొ తెలంగాణ ముదిరాజ్ మహాసభల మండల అధ్యక్షుడు ఊళ్లేంగల సాయికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం రోజున మత్స్య సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ముదిరాజులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముదిరాజులను బిసి-డి నుండి బీసీఏ కి మార్చి తమను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా చెరువులో చేపలు పట్టడమే వృత్తిగా పనిచేయడం జరుగుతుందని, 50 సంవత్సరాల దాటిన వారందరికీ వృత్తిపరంగా మత్స్యకార శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వం భీమాను ప్రకటించి తమను ఆదుకోవాలని కోరారు.




