Siddipet: సర్వే నంబర్లను తిరిగి మా గ్రామంలో కలపండి: మంత్రి వివేక్‌కు వినతి!
Siddipet: సర్వే నంబర్లను తిరిగి తమ గ్రామ రికార్డుల్లోకి మార్చాలి: సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి శివారు వెంకటాపూర్ రైతుల వినతిపత్రం.
Siddipet: సర్వే నంబర్లను తిరిగి మా గ్రామంలో కలపండి: మంత్రి వివేక్‌కు వినతి!
సిద్దిపేట: శివారు వెంకటాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41, 85, 88, 100కు సంబంధించిన సుమారు 113 ఎకరాల భూమిని తిరిగి తమ గ్రామ రికార్డులోకి మార్చాలని కోరుతూ గ్రామస్తులు సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం ఈ సర్వే నంబర్లలోని భూములు 2015-16 వరకు శివారు వెంకటాపూర్ గ్రామ రికార్డుల్లోనే ఉన్నాయని తెలిపారు.
2016-17 నుంచి తమ గ్రామ రికార్డుల నుంచి తొలగించి ఎర్రవల్లి గ్రామ రికార్డులోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ఆయా భూముల్లో తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామ రికార్డులు, నక్షా పటంలో సర్వే నంబర్లను తిరిగి శివారు వెంకటాపూర్ గ్రామ పరిధిలోకి మార్చి సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు.




