Gajwel: ములుగు శివారులో బైక్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు శివారులో బైక్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి ఆచూకీ కోసం ములుగు పోలీసులు సహకారం కోరారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 11 Nov 2026 9:13 PM IST
Gajwel
X

Gajwel: ములుగు శివారులో బైక్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి!

గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గం, ములుగు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు, కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియకపోవడంతో అతడిని గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ములుగు గ్రామ శివారులోని హవేలీ ఫామ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

TS 36 C 9745 నంబరు గల పల్సర్ ద్విచక్ర వాహనం ములుగు వైపు నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ములుగు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో తెలుపు రంగు టీషర్ట్, ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అతడి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలియరాలేదు.

మృతుడిని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అతడి వివరాలు తెలిసినవారు, కుటుంబ సభ్యులు లేదా బంధువులు వెంటనే ములుగు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. మృతుడి గుర్తింపునకు దోహదపడే సమాచారం ఉన్నవారు కూడా పోలీసులకు తెలియజేయాలని కోరారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

* ములుగు ఎస్‌ఐ: 8712667338

* ములుగు పోలీస్ స్టేషన్: 8712667461

* ములుగు పోలీస్ స్టేషన్, సిద్దిపేట కమిషనరేట్

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL