Gajwel: దసరా వేళ పాలపిట్టలను బంధిస్తే జైలు శిక్ష: అటవీశాఖ!

Gajwel: దసరా పండుగ వేళ పాలపిట్టలను బంధిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా గజ్వేల్ అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 19 Oct 2026 9:14 PM IST
Gajwel
X

Gajwel: దసరా వేళ పాలపిట్టలను బంధిస్తే జైలు శిక్ష: అటవీశాఖ!

గజ్వేల్: దసరా పండుగను పురస్కరించుకుని పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాల మేరకు, గజ్వేల్ అటవీశాఖ రేంజ్ అధికారి వినాయక్ సూచనలతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పించారు.

దసరా పండుగ సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ ఆలయాలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం లేదా వాటి స్వేచ్ఛకు భంగం కలిగించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం నేరమని అధికారులు తెలిపారు.

ఈ చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.పక్షులను బంధించి వాటి స్వేచ్ఛను హరించవద్దని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పక్షుల పట్ల కరుణ చూపుతూ వాటి సహజ ఆవాసాలకు ఎలాంటి హాని కలిగించకూడదని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, పక్షుల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా, ప్రకృతికి అనుకూలమైన వాతావరణంలో దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలని గజ్వేల్ అటవీశాఖ అధికారులు ప్రజలను కోరారు.బి

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL