Siddipet: సిద్దిపేటలో దుర్గామాత మండపాలను సందర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు!
Siddipet: సిద్దిపేటలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు కాలనీల దుర్గామాత మండపాలను మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Siddipet: సిద్దిపేటలో దుర్గామాత మండపాలను సందర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు!
సిద్దిపేట: జిల్లా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సిద్ధిపేట పట్టణంలోని పలు కాలనీల్లో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీశ్ రావు గారు సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువుదీరిన దుర్గామాతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, సిద్ధిపేట నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.




