Cheryal: డ్రైనేజీ మధ్యలో కరెంట్ స్తంభం ఏర్పాటుపై స్థానికుల ఆగ్రహం

Cheryal: చేర్యాలలో డ్రైనేజీ మధ్యలో కరెంట్ స్తంభం వేసి స్లాబ్ పనులు చేస్తుండటంతో కాంట్రాక్టర్, విద్యుత్ అధికారుల తీరుపై దుకాణదారులు మండిపడుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 30 Sept 2026 9:58 PM IST
Cheryal
X

Cheryal: డ్రైనేజీ మధ్యలో కరెంట్ స్తంభం ఏర్పాటుపై స్థానికుల ఆగ్రహం

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రం లో ఇటీవలే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా రోడ్డు కు ఇరు వైపుల డ్రైనేజి నీటితో పాటు వర్షపు నీరు వెళ్లడానికి మోరీలు నిర్మిస్తున్నారు.

గతంలో ఉన్న కరెంట్ స్తంబాలను తీసి మోరీలకు చివరిభాగంలో వేయాల్సిన ఉంది కానీ ఎలక్ట్రిసిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో కరెంట్ స్తంబాన్ని మోరి మధ్యలోనే వేసి దానిపై స్లాబ్ వేయడానికి పనులు చేపట్టారు.

ఎదురుగా ఉన్న దుకాణ దారులు చూసి స్తంబాన్ని తొలగించి పక్కకు వేయాలని సూచించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఎలక్ట్రిసిటీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL