Dubbak: చందాపూర్ గ్రామంలో అర్ధరాత్రి భారీ లారీ బోల్తా.. తప్పిన ముప్పు!

Dubbak: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భారీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 17 Nov 2026 10:32 AM IST
Dubbak
X

Dubbak: చందాపూర్ గ్రామంలో అర్ధరాత్రి భారీ లారీ బోల్తా.. తప్పిన ముప్పు!

దుబ్బాక: తొగుట మండలం చందాపూర్ గ్రామంలో అర్ధరాత్రి భారీ లారీ బోల్తా కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ - సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉన్న టోల్ గేట్ ఫీజు తప్పించుకునేందుకు కొందరు లారీ డ్రైవర్లు సిద్దిపేట నుంచి తొగుట మండలం మీదుగా గజ్వేల్ వైపు వెళ్లే అంతర్గత రహదారిని ఎంచుకొంటున్నారు.

ఈ రహదారి ఇరుకుగా ఉండటంతో పాటు మలుపులు ఎక్కువగా ఉన్నాయి. అదే సోమవారం అర్ధరాత్రి CG04 JD4790 నంబర్ గల భారీ లారీ గజ్వేల్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తుండగా చందాపూర్ గ్రామంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కకు బొల్తా కొట్టింది.ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది.

ఒకవేళ పగటి పూట అయితే భారీ ప్రాణ నష్టం జరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. లారీ బోల్తా కొట్టిన శబ్దానికి సమీపంలోని ఇళ్లలోని వారు బయటకు చూడగా లారీ పడిపోయింది. వెంటనే డ్రైవర్ ను బయటకు తీసి సహాయం చేశారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK