Dubbak: దుబ్బాకలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం పట్టాలు!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట 9వ వార్డు లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయంలో కౌన్సిలర్ వనం రమేష్ ఆధ్వర్యంలో 2BHK పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
Dubbak: దుబ్బాకలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం పట్టాలు!
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 9వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు 2BHK పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, GPO గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు పట్టా సర్టిఫికెట్లు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంలో నిరంతరం కృషి చేస్తామని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు బత్తుల స్వామి, లోకనీ మల్లేశం, కోలబోయిన రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




