Dubbak: పార్టీలకతీతంగా దుబ్బాకను అభివృద్ధి చేస్తాం: ఎంపీ రఘునందన్!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. కేంద్ర నిధులతో నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Dubbak: పార్టీలకతీతంగా దుబ్బాకను అభివృద్ధి చేస్తాం: ఎంపీ రఘునందన్!
దుబ్బాక: ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలందరూ ఒక్కటేనని, పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కొత్తగా కుల సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు.
గతంలో భూమి పూజ చేసి ప్రస్తుతం పూర్తయిన సంఘా భవనాలను ప్రారంభించారు. అనంతరం మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ రాజకీయంగా, ఆర్థికంగా దుబ్బాక నియోజకవర్గం మొదటినుంచి వెనుకబడి ఉందని, ఇక్కడి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 3.60 కోట్ల అమృత్ 2.0 నిధులు ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు.
దుబ్బాక అభివృద్ధికి మరియు ప్రజల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక నిధులు కేటాయించేలా, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే పాత టెండర్లను రద్దు చేసి తక్షణమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని పార్లమెంట్ సభ్యుడిగా తెలియజేస్తున్ననాని తెలిపారు.




