Dubbak: మా ఊరి మగధీర.. బైక్‌కు బదులు గుర్రంపై పొలానికి యువ రైతు!

Dubbak: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు చెక్ పెడుతూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం యువ రైతు కూరాకుల చందు బైక్‌కు బదులుగా గుర్రంపై స్వారీ చేస్తూ పొలానికి వెళ్తున్నాడు.

KARUNAKAR,	DUBBAK
Published on: 20 Nov 2026 11:00 AM IST
Dubbak
X

Dubbak: మా ఊరి మగధీర.. బైక్‌కు బదులు గుర్రంపై పొలానికి యువ రైతు!

దుబ్బాక: పెట్రోల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన యువ రైతు కూరాకుల చందు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. తన వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనానికి బదులుగా గుర్రాన్ని ఎంచుకున్నాడు.

ఇప్పుడు గుర్రంపై స్వారీ చేస్తూ పొలానికి వెళ్లడమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల్లోనూ తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కూరాకుల చందు నిత్యం తన వ్యవసాయ పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్లేవాడు. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తనకున్న ఆసక్తిని నెరవేర్చుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ పొలం వద్ద పశువులతో పాటు గుర్రాన్ని పెంచడం ప్రారంభించాడు.

పశువులకు మేత వేస్తూనే గుర్రానికి కూడా మేత వేస్తూ, క్రమంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత గుర్రంపై పొలానికి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నాడు.ప్రస్తుతం చందు గుర్రంపై స్వారీ చేస్తూ పొలానికి వెళ్లడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్తున్నాడు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK