Dubbak: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై విమర్శలు తగవన్న కాంగ్రెస్ నేత!
Dubbak: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమిటని కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
Dubbak: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై విమర్శలు తగవన్న కాంగ్రెస్ నేత!
దుబ్బాక: 10 సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఒరగపెట్టిందేందో ఒకసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారిని స్వాగతించాల్సింది పోయి ఆయన పైన విమర్శలు చేయడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు.
ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన సందర్భంగా సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా మొత్తం రూ. 544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు. సిద్దిపేట మరియు దుబ్బాక నియోజకవర్గాల్లో ఒక్కోచోట రూ. 200 కోట్ల చొప్పున (మొత్తం రూ. 400 కోట్లు) ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు. జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం.




