Siddipet: తాళ్లపల్లి ఇందిరమ్మ ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య దీపావళి సంబరాలు

Siddipet: సిద్దిపేట జిల్లా తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరిపిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ ప్రభాకర్.

Chindam Karunakar, Dubbak
Published on: 8 Nov 2026 8:58 PM IST
Siddipet
X

Siddipet: తాళ్లపల్లి ఇందిరమ్మ ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య దీపావళి సంబరాలు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మధ్య దీపావళి పండుగ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.ఈ వేడుకల్లో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్, గ్రామపంచాయతీ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతున్న వేళ, వారి మధ్య దీపావళి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆనందాన్ని కలిగించిందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్ పేర్కొన్నారు.ప్రతి ఇంటా సంతోషాలు, ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ లబ్ధిదారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak