Siddipet: సిద్దిపేటలో జిల్లాస్థాయి ఈఎల్సీ వ్యాసరచన, క్విజ్ పోటీలు ప్రారంభం!
Siddipet: సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ఈఎల్సీ) వ్యాసరచన, క్విజ్ పోటీలను ఆర్డీఓ సదానందం మంగళవారం ప్రారంభించారు.
Siddipet: సిద్దిపేటలో జిల్లాస్థాయి ఈఎల్సీ వ్యాసరచన, క్విజ్ పోటీలు ప్రారంభం!
సిద్దిపేట: ఈరోజు సిద్దిపేట బాలుర జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి ELC వ్యాసరచన మరియు క్విజ్ పోటీల ను RDO సిద్దిపేట శ్రీ సదానందం ప్రారంభించారు, నిన్న జరిగిన నియోజకవర్గస్థాయి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సదానందం మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
ముఖ్యంగా విద్యార్థులు భావిభారత ఓటర్లుగా ఈ విషయాలన్నీ తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో DIEO మాధవరావు గారు, ఎంఈఓ సిద్దిపేట అర్బన్, కళాశాల ప్రిన్సిపల్, గైడ్ టీచర్లు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థి విజేతలు పాల్గొన్నారు.




