Siddipet: సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగను ఘనంగా నిర్వహించాలి హరీష్ రావు!

Siddipet: సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 11న ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు.

RAJU, SIDDIPET
Published on: 4 Oct 2026 8:01 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగను ఘనంగా నిర్వహించాలి హరీష్ రావు!

Siddipet: సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగ సందర్బంగా సిద్దిపేట జిల్లా ఖ్యాతి కీర్తి ఎల్లలు దాటేల ఘనంగా వేడుకగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ అసోసియేషన్ లు, అడ్వకెట్స్, డాక్టర్స్, సిద్దిపేట ప్రముఖ లతో పదేళ్ల పండుగ పై సన్నాహాక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట జిల్లా 1983 నుండి నినాదం గానే మిగిలిందని కానీ.. నాడు సిద్దిపేట జిల్లా కావాలని అర్జీ పెట్టిన నాయకుడు కెసిఆర్ గారు.. తెలంగాణ వచ్చాక తొలి ముఖ్యమంత్రి గా తానే ఆరంభం చేసారని 2016 అక్టోబర్ 11 న సిద్దిపేట జిల్లాను ప్రారంబించి చరిత్ర లో సువర్ణద్యయాన్ని లిఖించారన్నారు.. సిద్దిపేట జిల్లా, గోదావరి జలాలు, రైలు రాక జిల్లా కేంద్రం ప్రజల ముంగిట్లో కి వచ్చింది, నినాదాలను నిజాలు గా చేసిన ఘనత కెసిఆర్ గారిది అని అన్నారు.. సిద్దిపేట జిల్లా రాకముందు ఎన్నో ప్రయాసలు పడ్డామని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జర్నలిస్ట్ లు వాణిజ్య వ్యాపార ఇలా అన్నీ వర్గాల వారు ఇబ్బంది పడ్డారని.. అలాంటి సిద్దిపేటను జిల్లా చేసుకోని అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని చెప్పారు. అలాంటి సిద్దిపేట జిల్లా ఈ అక్టోబర్ 11 2026 కి పదేళ్లు అవుతున్న సందర్భంగా సిద్దిపేట ఖ్యాతి ని ఎల్లలు దాటేల నిర్వహించుకుంద్దామని చెప్పారు.

ఈ సందర్బంగా వారి అభిప్రాయాల ను అడిగి తెల్సు కున్నారు.. సిద్దిపేట నాడు ఎలా ఉందొ.. ఇప్పుడు ఇలా ఉందొ భావి తరాలకు అందించాలని భాద్యత మన అందరి పై ఉందని చెప్పారు.. సిద్దిపేట జిల్లా ఎన్నో ఏళ్ల కల.. ఆ కలను నిజం చేసుకోవడం ఒక వైపు. పదేళ్ల లో ఎన్నో దేశానికే ఆదర్శ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పారు.. సిద్దిపేట చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి ఇలా అన్ని విషయాల పై పుస్తకాన్ని సావనీరు ను రూపొందించాలని చెప్పారు.. నాటి సిద్దిపేట నేటి సిద్దిపేట పై అద్భుతమైన డాక్యుమెంటరీ రూపొందిచాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా వేడుకగా ఒక పండగ చేద్దామని పిలుపునిచ్చారు..ఇవేగాకుండా జిల్లా ఏర్పాటుతో సాధించిన అభివృద్ధి, సిద్ధించిన సత్ఫలితాలపై జర్నలిస్టులు, కవులు, రచయితలు, డాక్టర్లు, అడ్వకేట్లు, వ్యాపారుల ఆధ్వర్యంలో చర్చావేధికలు అడ్వకేట్లు, వ్యాపారుల ఆధ్వర్యంలో చర్చావేధికలు నిర్వహించాలని చెప్పారు.

- ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాధాకృష్ణ శర్మ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుండు భూపేష్, ఉద్యోగ, ఉపాధ్యాయ, జర్నలిస్టులు, కవులు, రచయితలు, డాక్టర్లు, అడ్వకేట్లు, వ్యాపార విశ్రాంత ఉద్యోగులు, ప్రయివేట్ స్కూల్స్అసోసియేషన్ లు వివిధ అసోసియేషన్ ల ప్రతినిధులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET