Cherial: దొరికిన మొబైల్‌ను పోలీసులకు అప్పగించిన సీపీఐ నేత

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాలలో రోడ్డుపై దొరికిన ₹50 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను పోలీసుల ద్వారా బాధితురాలికి అందజేసి సీపీఐ నేత అందె అశోక్ నిజాయితీ చాటారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 25 Sept 2026 4:16 PM IST
Cherial
X

Cherial: దొరికిన మొబైల్‌ను పోలీసులకు అప్పగించిన సీపీఐ నేత

సిద్దిపేట, చేర్యాల : రోడ్డుపై దొరికిన మొబైల్ ఫోన్‌ను యజమానికి అప్పగించి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మానవత్వాన్ని చాటుకున్నారు. చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన అందె అశోక్ శుక్రవారం తన పని మీద చేర్యాలకు వస్తుండగా ఆకునూరు-చేర్యాల మార్గమధ్యలో రహదారిపై ఒక మొబైల్ ఫోన్ పడి ఉండటం గమనించారు. వెంటనే ఆ ఫోన్‌ను తీసుకొని చేర్యాల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించగా ధూల్మిట్ట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గద్దల స్నేహ గా తేలింది. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ గూడ అపూర్వరెడ్డి చేతుల మీదుగా 50వేల విలువ చేసే మొబైల్ ఫోన్‌ను యజమాని స్నేహకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ అపూర్వరెడ్డి అందె అశోక్ నిజాయితీని,మానవత్వాన్నిఅభినందించారు. నిజాయితీగా వ్యవహరించిన అశోక్ పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL